ETV Bharat / sitara

MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్దతు - మా ఎలక్షన్స్​ మంచు విష్ణు ప్యానల్​

'మా 'ఎన్నికల్లో(Maa elections 2021) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు హీరో బాలకృష్ణ. ఈ విషయాన్ని తెలియజేసిన విష్ణు(maa elections manch vishnu panel).. బాలయ్య మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

MAA Elections 2021
మంచు విష్ణుకు బాలయ్య మద్దతు
author img

By

Published : Oct 3, 2021, 1:56 PM IST

Updated : Oct 3, 2021, 2:38 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో(Maa elections 2021) అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు... సభ్యుల మద్దతు ఒక్కొక్కరిగా కూడగట్టుకున్నారు. ఈ మేరకు ఇటీవల తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు(maa elections manch vishnu panel)... తాజాగా నందమూరి బాలకృష్ణను కలిశారు. హైదరాబాద్​లో 'అఖండ' సినిమా చిత్రీకరణలో ఉన్న బాలయ్య దగ్గరికి స్వయంగా వెళ్లిన మంచు విష్ణు... మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు.

ఈ మేరకు బాలకృష్ణ(Balakrishna akhanda movie) తన మద్దతు, సహకారాన్ని తెలిపారని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాలకృష్ణతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. బాలయ్య మద్దతు ఇవ్వడం గౌరవంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

సభ్యులతో ప్రకాశ్​రాజ్​ భేటీ

'మా' అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎంతో ప్రయత్నిస్తున్నారు. తన టీమ్‌తో కలిసి వరుస ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన అసోసియేషన్‌ సభ్యులందరికీ లంచ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సభ్యులందరితో సమావేశమైన ప్రకాశ్‌రాజ్‌.. తన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ గురించి వివరించారు. 'మా' సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాళ్లతో చర్చలు జరిపారు. అలాగే, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: MAA ELECTIONS 2021: మా ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఇదే..

Last Updated : Oct 3, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.