ETV Bharat / sitara

రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు అనుకోని బ్రేక్​! - రామ్​చరణ్​ శంకర్​

రామ్​చరణ్​-శంకర్​ కాంబినేషన్​లో తెరకెక్కబోయే సినిమాకు ప్రస్తుతానికి బ్రేక్​ పడినట్లే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. శంకర్​ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు 2' షూటింగ్​ మధ్యలో ఆగిపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆ చిత్రానికి సంబంధించిన మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

Lyca Productions initiates legal battle against Shankar
రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు అనుకోని బ్రేక్​!
author img

By

Published : Apr 1, 2021, 1:16 PM IST

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​- దర్శకుడు శంకర్​ కాంబినేషన్​లో ఓ సినిమా రూపొందనుంది. చెర్రీ 'ఆర్​ఆర్​ఆర్' షూటింగ్​ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అయితే తాజా పరిణామాలతో ఆ సినిమా ప్రారంభం అవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. శంకర్​ మొదలుపెట్టిన 'భారతీయుడు 2' షూటింగ్​ పూర్తి చేయకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ​

కరోనా సంక్షోభానికి ముందు కమల్​ హాసన్​ ప్రధానపాత్రలో 'భారతీయుడు 2' షూటింగ్​ ప్రారంభించారు. అయితే చిత్రీకరణ సమయంలో లైటింగ్​ క్రేన్​ కూలిపోయి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందారు. ఈ ఘటనతో 'భారతీయుడు 2' షూటింగ్​ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సంక్షోభం.. కమల్​ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చిత్రీకరణ తిరిగి ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో రామ్​చరణ్​తో సినిమా చేసేందుకు దర్శకుడు శంకర్​ ముందుకొచ్చారు. దీంతో శంకర్​పై సదరు నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. ఆగిపోయిన షూటింగ్​ను పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు చేసుకోవాలని డిమాండ్​ చేసిందట.

'భారతీయుడు 2' సినిమాకు లైకా ప్రొడక్షన్స్​ కేటాయించిన రూ.230 కోట్ల బడ్జెట్​లో ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రూ.50 కోట్లతో చిత్రీకరణను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పట్టుబట్టిందట. ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో రామ్​చరణ్​తో శంకర్​ సినిమా ప్రారంభాని ముందే అవరోధం వచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చూడండి: ప్రముఖ నటి కిరణ్ ఖేర్​కు బ్లడ్ క్యాన్సర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.