ETV Bharat / sitara

ఆ బంపర్​ ఆఫర్​ ప్రభాస్​ తర్వాత బన్నీకే! - అల్లుఅర్జున్​ లేటెస్ట్​ మూవీ

Lyca productions Alluarjun: 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న హీరో అల్లుఅర్జున్​తో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాప్రొడక్షన్స్​ ఆసక్తి చూపిస్తోందట! ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్​ను బన్నీకి ఆఫర్​ చేసిందని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే టాలీవుడ్​లో ప్రభాస్​ తర్వాత అంత మొత్తంలో పారితోషికం అందుకున్న హీరో బన్నీనే అవుతారట!

prabhas alluarjun
ప్రభాస్​ అల్లుఅర్జున్​
author img

By

Published : Jan 19, 2022, 8:15 PM IST

Lyca productions Alluarjun: సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా వచ్చిన 'పుష్ప' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే టాక్​. ఇక ఈ చిత్రంతో ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ క్రేజ్​ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బన్నీతో సినిమా చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు, దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారట! భారీ పారితోషికాన్ని ఆఫర్​ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​.. అల్లుఅర్జున్​తో ఓ భారీ సినిమా చేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది. పాన్​ ఇండియా స్థాయిలోనే ఈ ప్రాజెక్ట్​ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం బన్నీకి ఏకంగా రూ.75కోట్లు ఇచ్చేందుకు సదరు సంస్థ సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, 'పుష్ప' చిత్రం కోసం ఆయన రూ.50కోట్లు తీసుకున్నారట! ఒకవేళ లైకా ప్రొడక్షన్స్​ ఆఫర్​ చేసింది నిజమైతే బన్నీ కెరీర్​లో ఇదే భారీ రెమ్యునరేషన్​ అవుతుంది. ఇక టాలీవుడ్​లో ప్రభాస్​ తర్వాత అంత మొత్తంలో పారితోషికం తీసుకోనున్న కథానాయకుడు అల్లుఅర్జునే అవుతారు.

ఇదీ చూడండి: RGV Unstoppable: 'బాలయ్య.. 'అన్‌స్టాపబుల్‌'కు నేనూ వస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.