ETV Bharat / sitara

'లవ్​స్టోరీ' సినిమా విడుదల వాయిదా..! - సాయి పల్లవి సినిమా అప్​డేట్స్​

టాలీవుడ్​ యువ కథానాయకుడు నాగచైతన్య- శేఖర్​ కమ్ముల కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రం 'లవ్​స్టోరీ'. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడొచ్చని తెలుస్తోంది.

Lovestory Movie release was going to be postponed
'లవ్​స్టోరీ' సినిమా విడుదల వాయిదా..!
author img

By

Published : Mar 9, 2020, 5:49 PM IST

Updated : Mar 9, 2020, 6:26 PM IST

'ఫిదా' వంటి హిట్‌ తర్వాత దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి వస్తోన్న చిత్రం 'లవ్​స్టోరీ'. ఇందులో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన దళిత కుర్రాడిగా.. సాయిపల్లవి ఓ ధనిక యువతిగా కనిపించనుందని సమాచారం. వీళ్లిద్దరి మధ్య నడిచే ప్రేమకథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు కమ్ముల. ఇటీవలే హైదరాబాద్​లోని ఓ సినిమా థియేటర్​లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరిపారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త విషయం సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ముందుగా వచ్చే నెలలో రిలీజ్​ చేయాలని చిత్రబృందం అంచనా వేసిందట. పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల ఆలస్యం కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరగవచ్చని టాలీవుడ్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందువల్ల మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. ఏయన్నార్​ పాటకు నాగచైతన్య స్టెప్పులు..!

Last Updated : Mar 9, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.