ప్రేమ.. పలకడానికి రెండక్షరాలే. కానీ అందులో ఎంతో ఫీల్ ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి ప్రేమికులు పడే తపన అంతా ఇంతా కాదు. అయితే వారికి ఎనలేని ప్రేమను చెప్పడానికి సినిమాలు ప్రయత్నిస్తుంటాయి. కొన్ని చిత్రాల్లోని పాటలు ప్రేమికుడి మనసులని భావాలకి అర్థాలవుతాయి. ఆ పాటను వింటూ అతడు లోకాన్ని మైమరిచిపోయేలా చేస్తాయి. అందులోనూ టాలీవుడ్ ఈ ప్రేమ పాటలకి పెట్టింది చిరునామాగా మారింది. ఈ మధ్య అలా ప్రేక్షకుల, ప్రేమికుల హృదయాల్ని హత్తుకున్న ప్రేమ పాటలపై ఓ లుక్కేద్దాం.
ఊహలే ఊహలే (జాను)
తమిళంలో ఘనవిజయం సాధించిన 96కు తెలుగు రీమేక్ జాను. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. గోవింద వసంత ఇచ్చిన మ్యూజిక్ అలరించేలా ఉంటుంది. ఇందులో ఊహలే ఊహలే అంటూ సాగే పాట ఈ మూవీకి ఆత్మ లాంటింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉండిపోవ నువ్వివా, నీ కన్నులు (సవారి)
నందు, ప్రియాంక శర్మ జోడీగా నటించిన చిత్రం సవారి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ఉండిపోవ నువ్విలా, నీ కన్నులు అనే పాటలు సినిమాపై అంచనాల్ని పెంచాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏమో ఏమో (రాహు)
అభిరామ్ వర్మ, క్రితి గార్గ్ జంటగా నటించిన చిత్రం రాహు. ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన ఏమో ఏమో సాంగ్ యువతకు బాగా కనెక్ట్ అయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యూ ఆర్ మై హార్ట్ బీట్ (ఇద్దరి లోకం ఒకటే)
రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమాలోని యూ ఆర్ మై హార్ట్ బీట్ అనే సాంగ్ వినసొంపుగా ఉంటుంది. ప్రేమికులకు బాగా అట్రాక్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సామజవరగమన, బుట్ట బొమ్మా (అల వైకుంఠపురములో)
కొంత గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురింపించింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి సంగీతం కూడా కారణం. ఈ మూవీ కోసం తమన్ అందించిన పాటలు యూట్యూబ్ రికార్డుల్ని చెరిపేశాయి. యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందులో సామజవరగమన, బుట్టబొమ్మ ప్రేమి పావురాలను అలరించేలా ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కడలల్లె, ఎటు పోనే, నీ నీలి కళ్లల్లోన (డియర్ కామ్రేడ్)
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయినా.. పాటలు మాత్రం అలరించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాలో మైమరపు (ఓ బేబీ)
సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఓ బేబీ మంచి విజయం సాధించింది. ఇందులో సామ్ నటకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలోని నాలో మైమరపు అనే పాట చాలా బాగుంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గగన వీధిలో (గద్దలకొండ గణేష్)
గద్దలకొండ గణేష్ చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇందులోని పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. గగన వీధిలో అనే సాంగ్ ప్రేమికులు పాడుకునేదిలా ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హొయినా హొయినా, నిన్ను చూసే ఆనందంలో (గ్యాంగ్ లీడర్)
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గ్యాంగ్‌లీడర్. ఈ సినిమా వసూళ్ల విషయంలో వెనకపడ్డా పాటలు మాత్రం ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం బాగుంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కోపంగా కోపంగా (మిస్టర్ మజ్ను)
అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మంచి హిట్‌ను దక్కించుకోలేకపోయాడు. గతేడాది విడుదలైన ఈ హీరో సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఇందులోని కోపంగా కోపంగా అనే సాంగ్ మాత్రం ప్రేక్షకులకు దగ్గరైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమ వెన్నెలా (చిత్రలహరి)
వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఈ సినిమా మంచి విజయాన్నిచ్చింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధానబలం. ముఖ్యంగా ప్రేమ వెన్నెల అనే సాంగ్ ప్రేమికులక్ లవ్ ఆంథమ్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రియతమ ప్రియతమ (మజిలీ)
అక్కినేని హీరో నాగ చైతన్య. తన భార్య సమంత కలిసి నటించిన తొలి చిత్రం మజిలీ. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందుకు మ్యూజిక్ కూడా తోడైంది. గోపి సుందర్ అందించిన సంగీతం యువతకు బాగా కనెక్ట్ అయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కన్నే కన్నే (అర్జున్ సురవరం)
అర్జున్ సురవరం యువ హీరో నిఖిల్‌కు మంచి విజయాన్ని అందించింది. ఇందులో జర్నలిస్టుగా నటించిన నిఖిల్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. ఇందులోని కన్నే కన్నే సాంగ్ ప్రేమికులను అలరించేలా ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నీ పరిచయముతో (చూసి చూడంగానే)
శివ కందుకూరి, వర్ష బొలమ్మ, మాలవిక సతీషన్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం చూసి చూడంగానే. ఈ సినిమాలోని నీ పరిచయముతో అనే పాట మెలోడియస్గా బాగుంటుంది. సిద్ శ్రీరామ్ గాత్రం హైలెట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమ ఓ ప్రేమ (ఎన్జీకే)
సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎన్జీకే. ఈ సినిమాలోని ప్రేమ ఓ ప్రేమ అనే పాట ప్రేమికులను అలరిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో రూపొందిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నీలి నీలి ఆకాశం (30రోజుల్లో ప్రేమించడం ఎలా)
యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇటీవల ఇందులోని నీలి నీలి ఆకాశం అనే పాట విడుదలై ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, సిద్ శ్రీరామ్ గాత్రం అలరించేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">