ETV Bharat / sitara

రవితేజ సరసన 'గాలి సంపత్' భామ!

author img

By

Published : Mar 9, 2021, 7:29 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో హీరోయిన్​గా లవ్​లీ సింగ్​ పేరు ఖరారైనట్లు సమాచారం.

Lovely Singh to romance with Raviteja
రవితేజ సరసన 'గాలి సంపత్' భామ!

తొలి సినిమా విడుదల కాకముందే కొత్త భామ లవ్‌లీ సింగ్‌ మరో అవకాశాన్ని చేజిక్కించుకుందా? ఆమె రవితేజకి జోడీగా నటించబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందబోతుంది. ఇందులో ఇద్దరు భామలకి చోటుంది. ఇందులో ఓ నాయికగా లవ్‌లీ సింగ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న 'గాలి సంపత్‌'తో తెలుగు తెరకు పరిచయమవుతోంది లవ్​లీ. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.