'సారంగ దరియా' పాట వివాదం ఎట్టకేలకు ముగిసింది. 'లవ్‌స్టోరి' సినిమాలోని ఈ పాట విషయంలో తనకెలాంటి అభ్యంతరం లేదని జానపద గాయని కోమల ప్రకటించింది. చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేసింది.
'సారంగ దరియా' పాటను తనతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులుగా ఉందని కోమలి అన్నారు. 'రేలారే రేలా' డైరెక్టర్ సురేశ్ చొరవతో దర్శకుడు శేఖర్ కమ్ములను కలిశానని చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాలో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారని.. అలాగే 'లవ్‌స్టోరి' ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట తనతోనే పాడిస్తానని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
సమాచార లోపంతో గాయని కోమలిని కలువలేకపోయానని దర్శకుడు శేఖర్ కమ్ములు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా చేసిన హామీలను తాను నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
ఇది చదవండి: యూట్యూబ్‌లో 'సారంగ దరియా' పాట రికార్డు