ETV Bharat / sitara

ప్రేమికుల రోజున 'ఏయ్​ పిల్లా..' పాట విడుదల

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'లవ్​స్టోరీ'. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఓ పాటను మ్యూజికల్​ ప్రివ్యూగా విడుదల చేయనున్నట్టు తెలిపింది చిత్రబృందం.

author img

By

Published : Feb 13, 2020, 9:46 AM IST

Updated : Mar 1, 2020, 4:30 AM IST

love story movie musical preview
వాలంటైన్స్​డేకు 'ఏయ్​ పిల్లా..' పాట విడుదల

ప్రేమకథల్ని తెరకెక్కించడంలో మాస్టర్‌ అనిపించుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాల్ని నడిపిస్తూ... హీరోహీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీని పండించే విధంగా సన్నివేశాలు తెరకెక్కిస్తాడు. ప్రస్తుతం మరో అందమైన 'లవ్‌స్టోరీ'ని రూపొందిస్తున్నాడు శేఖర్​ కమ్ముల. ప్రేమికుల రోజుని పురస్కరించుకొని శుక్రవారం ఈ చిత్రంలోని 'ఏయ్‌ పిల్లా...' పాటని మ్యూజికల్‌ ప్రివ్యూగా విడుదల చేయబోతున్నారు. 'లవ్​స్టోరీ' చిత్రం సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ.

love story movie musical preview
లవ్​స్టోరీ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి

"ఈ వేసవికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రేమకథ ఇది. ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సి.హెచ్‌ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఒక నిమిషం పాటు సాగే 'ఏయ్‌ పిల్లా' పాటలోని సంగీతం మనసుల్ని హత్తుకుంటుంది" అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి.. పవర్​స్టార్​ కోసం తమన్​ - సిద్​ శ్రీరామ్​ కాంబినేషన్​

Last Updated : Mar 1, 2020, 4:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.