ETV Bharat / sitara

లిరికల్​ వీడియో: 'ఏయ్​ పిల్లా.. పరుగున పోదామా' - సాయి పల్లవి

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్​స్టోరీ'. ప్రేమికుల రోజున ఈ సినిమాలోని 'ఏయ్​ పిల్లా' ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఆ పాట పూర్తి లిరికల్ వీడియోను సోషల్​ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం.

LOVE STORY movie: 'aye pilla' Full lyrical Song Out now
లిరికల్​ వీడియో: 'ఏయ్​ పిల్లా.. పరుగున పోదామా'
author img

By

Published : Mar 11, 2020, 4:12 PM IST

ప్రేమకథల్ని తెరకెక్కించడంలో మాస్టర్‌ అనిపించుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాల్ని నడిపిస్తూ... హీరోహీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీని ఉండేలా సన్నివేశాలు తెరకెక్కిస్తాడు. తాజాగా మరో అందమైన 'లవ్‌స్టోరీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడీ స్టార్​ డైరెక్టర్​. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు.

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో 'ఏయ్​ పిల్లా' ప్రోమోకు విశేషాదరణ లభించటం వల్ల.. తాజాగా ఆ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సి.హెచ్‌ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్‌దాస్‌, కె.నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. లవ్​స్టోరీ: అమ్మాయి ముద్దు పెడితే ఏడుస్తారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.