ETV Bharat / sitara

Looop Lapeta Review: 'లూప్​ లపేట'  ఎలా ఉందంటే.. - టైమ్​లూప్​ కాన్సెప్ట్​

Looop Lapeta: టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం లూప్​ లపేట. తాప్సీ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం నెట్​ఫ్లిక్స్​లో విడుదలైంది. మరి టైమ్​ లూప్​ కాన్సెప్ట్​తో ప్రేక్షకులను అలరించిన చిత్రాల జాబితాలో లూప్​ లపేటా చేరిందా?

Looop Lapeta
లూప్​ లపేట
author img

By

Published : Feb 8, 2022, 4:57 PM IST

చిత్రం: లూప్‌ లపేట

నటీనటులు: తాప్సీ, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, దివ్యేందు భట్టాచార్య, శ్రేయా ధన్వంతరి, రాజేంద్ర చావ్లా తదితరులు;

సంగీతం: సిద్ధాంత్‌ మాగో, మయాంక్‌ మెహ్రా, శంతను, రాహుల్‌ పైస్‌, నారిమన్‌;

సినిమాటోగ్రఫీ: యశ్‌ ఖన్నా;

ఎడిటింగ్‌: ప్రియాంక ప్రేమ్‌ కుమార్‌;

రచన: డాక్టర్‌ వినయ్‌ చావ్లా, కేతన్‌ పెడ్గోంకర్‌, ఆకాశ్‌ భాటియా, అర్నవ్‌ వేపా నండూరి;

దర్శకత్వం: ఆకాశ్‌ భాటియా;

విడుదల: నెట్‌ఫ్లిక్స్‌

గతకొంత కాలంగా అన్ని చిత్ర పరిశ్రమలోనూ టైమ్‌ ట్రావెల్‌, టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవల శింబు 'మానాడు'తోనూ అలరించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'లూప్‌ లపేట'. జర్మన్‌ చిత్రం 'రన్‌ లోలా రన్‌' నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు. మరి 'లూప్‌ లపేట' కథ ఏంటి? టైమ్‌ లూప్‌లో ఇరుక్కుపోయిన తాప్సీకి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడింది?

loop lapeta
'లూప్​ లపేటా'లో సన్నివేశం

కథేంటంటే..

సావి(తాప్సీ) అథ్లెట్‌. చిన్నప్పటి నుంచి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. కానీ, ఒక రేసులో కిందపడిపోవటం వల్ల మోకాలికి దెబ్బ తగిలి ఆస్పత్రి పాలవుతుంది. ఇక జీవితంలో ట్రాక్‌ ఎక్కలేనని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సావి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆస్పత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకుదామనే సమయానికి సత్యజిత్‌ (తాహిర్‌ రాజ్‌ భాసిన్‌) వచ్చి కాపాడతాడు. గ్యాంబ్లింగ్‌ ఆడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలనుకునే వ్యక్తిత్వం కలవాడు సత్యజిత్‌. తనని కాపాడటం వల్ల సావి అతడిని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతారు. ఒకరోజు సత్యజిత్‌ బాస్‌ అతడికి రూ.50లక్షలు తీసుకొచ్చే బాధ్యతను అతడికి అప్పగిస్తాడు. అనుకోకుండా సత్యజిత్‌ ఆ డబ్బును పోగొడతాడు? మరి సత్యజిత్‌ ఆ డబ్బును ఎలా తిరిగి తెచ్చాడు? ఈ విషయంలో సావి అతడికి ఏవిధంగా సాయం చేసింది? టైమ్‌లూప్‌లో ఇరుక్కుపోయిన సావి ఎలా బయట పడింది? అనేది కథ.

loop lapeta
లూప్​ లపేట పోస్టర్

ఎలా ఉందంటే..

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్‌ చేయడం కొత్తేమీ కాదు. విదేశీ భాషల్లో విడులైన చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగు దర్శకులు ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అలా 1998లో విడుదలైన జర్మన్‌ చిత్రం 'రన్‌ లోలా రన్‌' భారతీయ నేటివిటీకి అనుగుణంగా మార్చుకుని తెరకెక్కించడంలో దర్శకుడు ఆకాశ్‌ భాటియా విజయం సాధించారు. టైమ్‌లూప్‌ కాన్సెప్ట్ చిత్రాలను తీర్చిదిద్దడంలో ఏ మాత్రం తేడా వచ్చిన ప్రేక్షకుడు సహనానికి పరీక్షపెడతాయి. ఈ విషయంలో ఆకాశ్‌ తెలివిగా వ్యవహరించాడు. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఈ కథ అర్థం కావటం కోసం పురాణగాథ 'సతీ సావిత్రి' ఇతివృత్తాన్ని నాయకనాయికలతో చెప్పించడం బాగుంది.

Looop Lapeta
'లూప్​ లపేటా'

సావి లక్ష్యంతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆమెకు దెబ్బ తగలడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, సావి-సత్యజిత్‌ల ప్రేమ ఇలా ఆరంభ సన్నివేశాలన్నీ రొటీన్‌గా సాగుతాయి. అంతేకాదు, సావి-సత్యలు ప్రేమలో పడిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో రొమాన్స్‌ డోస్‌ కాస్త ఎక్కువగానే ఉంది. ఎప్పుడైతే సత్యజిత్‌ డబ్బు బ్యాగ్‌ను పోగొట్టుకుంటాడో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి సావితో పాటు సినిమా కూడా పరుగులు పెడుతుంది. తన ప్రియుడిని సావి ఎలా కాపాడిందన్నదే అసలు కథ. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూనే నవ్వులు పంచుతుంది. కథానాయకుడి పాత్రకు చిత్తూరు యాసతో డబ్బింగ్‌ చెప్పించారు. సినిమా ప్రారంభమైనప్పుడు వినటానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, సన్నివేశాలు నడుస్తున్న కొద్దీ బాగానే ఉంది. అప్పు, గప్పు పాత్రలను 5స్టార్‌ చాక్లెట్‌ యాడ్‌ 'రమేశ్‌-సురేశ్‌'ల నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు. ఆ రెండు పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాప్సీ తప్ప తెలిసిన వాళ్లెవరూ లేకపోయినా ప్రతి పాత్రా ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతుంది. టైమ్‌ ట్రావెల్‌ కథలను ఇష్టపడేవాళ్లకే కాదు, సాధారణ ప్రేక్షకులకు 'లూప్‌ లపేట' నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే: విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది తాప్సీ. 'లూప్‌ లపేట'లో తాప్సీ పోషించిన సావి పాత్ర ఆమెను మరో మెట్టు ఎక్కించింది. మోడ్రన్‌ గర్ల్‌గా నటన, స్టైల్‌గా కనిపించిన విధానం కొత్తగా ఉంది. ఓటీటీలో విడుదల కావటం వల్ల రొమాన్స్‌, అసభ్యపదజాలాన్ని అలాగే వదిలేశారు. తాప్సీకి దీటుగా తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ నటన కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా తెరపై అతడు పలికించే హావభావాలు అలరిస్తాయి. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. అప్పు, గప్పులుగా చేసిన మాణిక్‌, రాఘవరాజ్‌ల తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. రాహుల్‌ పైజ్‌, నారిమన్‌ సంగీతం సినిమాకు అదనపు బలాన్ని చ్చింది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ యశ్‌ ఖన్నా సినిమాటోగ్రఫీ. గోవా సరికొత్తగా చూపించారు. సినిమాకు తగినట్లు ఎంచుకున్న థీమ్‌, కలర్స్‌ అన్నీ బాగున్నాయి. ప్రియాంక్‌ ప్రేమ్‌ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. తికమక లేకుండా టైమ్‌లూప్‌ సన్నివేశాలను కూర్చిన విధానం బాగుంది. రన్‌ లోలా రన్‌ను భారతీయ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు ఆకాశ్‌ భాటియా విజయం సాధించారు. అయితే, ఎందుకు తాప్సీ టైమ్‌లూప్‌లో ఇరుక్కుపోతోందో అనే విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు.

బలాలు

+ తాప్సీ, తాహిర్‌ రాజ్‌ల నటన

+ కథ, స్క్రీన్‌ప్లే

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు

చివరిగా: సరదాగా సినిమా చూడాలనుకుంటే 'లూప్‌ లపేట' చూడొచ్చు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజ్​ అయ్యే చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.