ETV Bharat / sitara

ఆ పుస్తకం మహేశ్​బాబును సిగరెట్​ మాన్పించిందట! - పవన్ కళ్యాణ్ తాజా వార్తలు

అవును.. మీరు విన్నది నిజమే! టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. ఓ పుస్తకం తన సిగరెట్​ మాన్పించేసిందని అంటున్నారు. అంతేకాదు మన టాలీవుడ్​ సినీ నటుల్లో ఎంతో మందికి పుస్తక పఠనం అలవాటు ఉంది. మరికొంత మందికి పుస్తకాలు చదవటమే కాదు.. సేకరించటమూ ఇష్టమట. అలా వారు చదివిన పుస్తకాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వాటి సంగతులేంటో చూసేయండి.

stars
స్టార్స్
author img

By

Published : Sep 19, 2021, 8:07 AM IST

ఎప్పుడూ షూటింగ్‌లూ, వ్యాయామం, నిద్ర, విహారయాత్రలూ.. అంటూ గడిపే నటీనటుల్లో ఎక్కువమందికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా.. పుస్తక పఠనం. అవును.. వాళ్లు చదవడమే కాదు మీరూ చదవండి అంటూ తమ అభిమానులకూ ఆ పుస్తకాల గురించి చెప్పడంలో ముందుంటారు.

దినచర్యలో ఓ భాగం

పుస్తకాలు చదివే నటీనటుల్లో మొదట వినిపించేది పవన్‌కల్యాణ్ పేరే. ఇప్పటివరకూ వేలల్లోనే పుస్తకాలు చదివేసిన పవన్‌కల్యాణ్​ పుస్తకపఠనం తన దినచర్యలో ఓ భాగమని అంటారు. తీరిక ఉన్నా లేకపోయినా ఏదో ఒక పుస్తకం చదవకపోతే తోచదని చెప్పే పవర్‌స్టార్‌ ఒంటరితనం పోగొట్టుకునేందుకు వాటిని మించిన సాధనం లేదనీ అంటారు.

z
పవన్​కళ్యాణ్

"నేను ఇదీ అదీ అని కాకుండా అన్నిరకాల పుస్తకాలనూ చదివేందుకు ఇష్టపడతా. అవి మన మనసునీ, ఆలోచనల్నీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్లు ఏ నిర్ణయాన్ని అయినా సరిగ్గా తీసుకోగలరు. ఏ సందర్భానికి ఎలా స్పందించాలనే స్పష్టత కూడా వారికి ఉంటుంది. నాకు మాత్రం అవి కేవలం పుస్తకాలు మాత్రమే కాదు.. మంచి స్నేహితులు కూడా" అని చెప్పారు పవన్‌కల్యాణ్‌.

నాన్న మాటలు గుర్తుంటాయి

లవర్‌బాయ్‌గా విజయ్‌ దేవరకొండకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. తాను చేసే పనులెప్పుడూ వినూత్నంగా ఉండాలని తపనపడే విజయ్‌కు పుస్తకపఠనం పుట్టపర్తిలోని సత్యసాయి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అలవాటయ్యిందట.

ి
విజయ్ దేవరకొండ

"అక్కడ టీవీలూ, ఫోన్లూ ఉండేవి కావు. దాంతో పుస్తకాలూ, వార్తాపత్రికలే మా ప్రపంచం. వాటిని చదవడం వల్ల కథలు రాయడం కూడా నేర్చుకున్నాం" అని చెప్పే విజయ్‌ వాటన్నింటితోనే తన ఆలోచనా దృక్పథం మారిందని అంటున్నారు.

"ఓసారి మా నాన్న.. జీవితంలో వయసు పెరిగేకొద్దీ ఎదురయ్యే అనుభవాలను ముందే తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవాలంటే పుస్తకపఠనాన్ని మించింది లేదని చెప్పారు. అప్పటి నుంచీ నాకు ఉపయోగపడే పుస్తకాలను చదివేందుకు ప్రయత్నిస్తున్నా. ఏకబిగిన చదివేందుకు వీలు కుదరకపోయినా తీరిక దొరికినప్పుడల్లా పది పేజీలు చదువుతూ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుంటా.." అనే విజయ్‌ తన సన్నిహితులకు కూడా వాటిని సూచిస్తుంటారు.

అది చదివాకే సిగరెట్‌ మానేశా

ి
మహేశ్​బాబు

సూపర్‌స్టార్‌ మహేశ్​బాబుకు పుస్తకాలంటే ఎంత ఇష్టమంటే.. తాను చదివే ప్రతి పుస్తకాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుంటాడు. "ఒకప్పుడు నాకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. ఎంత ప్రయత్నించినా మానలేక పోయా. ఆ సమయంలో ఎలెన్‌ కార్‌ రాసిన 'ద ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌' అనే పుస్తకాన్ని ఎవరో కానుకగా ఇచ్చారు. దాన్ని చదివాక నేను మళ్లీ సిగరెట్‌ తాకలేదు. ఇలా నేను చదివే ప్రతి పుస్తకం నాకు ఉపయోగపడాలని అనుకుంటా. అలాంటి వాటిల్లో 'థింక్‌ లైక్‌ ఏ మాంక్‌', 'చాటర్‌'.. వంటివి కొన్ని. అందుకే వాటి గురించి ఎప్పటికప్పుడు నా అభిమానులకీ చెబుతుంటా".. అని వివరిస్తున్నారు.

తీరిక దొరికితే పుస్తకమే

ప్రముఖ హీరోలతో నటిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే.. తీరిక దొరికితే చేసే పని పుస్తకాలు చదవడమేనట. షూటింగుల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే సమయంలోనూ ప్రయాణం బోర్‌కొట్టకుండా తన వెంట ఓ పుస్తకాన్ని కచ్చితంగా ఉంచుకుంటానని చెబుతుందీ కన్నడ భామ.

.
పూజా హెగ్డే

"కరోనా వచ్చినప్పుడు పదిహేను రోజులు ఒంటరిగా ఉన్న నాకు పుస్తకాలే తోడయ్యాయి. తీరిక దొరికినప్పుడూ, ఆదివారం రోజునా తప్పక ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుంటా.." అని చెప్పే పూజాహెగ్డేకు చరిత్రకు సంబంధించినవీ సానుకూల దృక్పథాన్ని పెంచే పుస్తకాలంటే చాలా ఇష్టమట.

పుస్తకం చదివాకే నిద్ర

త్వరలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో తెలుగు తెరకూ పరిచయం కానున్న అలియాకు పుస్తకాలు చదవడం సహా వాటిని సేకరించడమూ ఇష్టమట. అలా నచ్చిన ప్రతి పుస్తకాన్నీ కొనేసి తన ఇంటిని మినీ లైబ్రరీగా మార్చేసుకుందట. ఎప్పుడైనా తనకోసం కొంత సమయం పెట్టుకోవాలనుకున్నప్పుడూ, ఒత్తిడిని దూరం చేసుకోవాలనుకున్నప్పుడూ చేసే మొదటి పని పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని చెబుతుంది.

ి
అలియా భట్

"బాగా ఒత్తిడిగా ఉన్న రోజు నేను ఏదో ఒక పుస్తకాన్ని కాసేపైనా చదువుతా. ముఖ్యంగా హ్యారీపాటర్‌ సిరీస్‌ అంటే ఇష్టం. పొద్దున్నే నిద్రలేచాక కూడా ఆ రోజు న్యూస్‌పేపర్‌ చదివాకే మిగిలిన పనులు చేసుకుంటా. దానివల్ల చుట్టూ ఏం జరుగుతోందనేది తెలుస్తుంది" అంటుంది అలియా.

ఇదీ చదవండి: అభిమానితో వీడియోకాల్‌లో మాట్లాడిన ప్రభాస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.