తన అభినయంతో నవ్వులు పుట్టించే అదిరే అభి.. 'జబర్దస్త్'తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కెరీర్ ఆరంభంలో యాక్టింగ్‌పై తన ఆసక్తులను, ఏఎన్ఆర్తో తనకున్న అనుబంధాన్ని ఇటీవల 'ఆలీతో సరదాగా' టాక్‌షోకు హాజరైనప్పుడు పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌లో రాణించాలని కలల కన్న తనకు త్యాగరాజ గానసభలో ఓ రోజు ఏఎన్ఆర్ కనిపించినట్లు అభి చెప్పారు. అక్కడ ఆయన్ని చూడగానే తనను యాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి అని ఆయన అడిగినట్లు తెలిపారు. అప్పుడు ఏఎన్ఆర్.. దీవించినంత మాత్రాన యాక్టర్ అవ్వరని అన్న మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ తర్వాత యాక్టింగ్‌పై పూర్తి దృష్టి సారించినట్లు అభి చెప్పారు. మిమిక్రీ ఆర్టిస్ట్.. యాక్టర్స్‌ను ఇమిటేట్ చేసే అంశంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కూడా సంపాదించానని వెల్లడించారు. తన యాక్టింగ్ చూసి అమెరికాలోని ఓ ప్రోగ్రామ్‌లో ఏఎన్ఆర్ మెచ్చుకున్నారని అదిరే అభి తెలిపారు.
ఇదీ చదవండి:నాలుగు భాషల్లో పట్టు తెచ్చుకున్న ఏకైక నటి!