"కరోనా దాడి చేస్తోన్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమందరం రైతుకి అండగా నిలుద్దాం" అన్నారు నటుడు సాయికుమార్. ఆయన ఓ వీడియో ద్వారా రైతన్నల గురించి మాట్లాడారు. "రైతన్న ఇబ్బందుల్లో ఉన్నాడు. రైతాంగం పండించిన అరటి, బత్తాయి, నిమ్మ, మామిడి, జామ పళ్లని ప్రతి ఒక్కరూ కొనుక్కుని తిందాం. రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం. మనకి రైతు అవసరం, రైతుకు మనం అవసరం. మనమందరం దేశానికి అవసరం" అన్నారు సాయికుమార్.
ప్రముఖ నటుడు సాయికుమార్.. అతని తనయుడు, కథానాయకుడు ఆదితో కలిసి సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి రూ.5,00,004 విరాళం అందించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు మరో రూ.1,00,008 ఆర్థిక సాయం చేశారు.
ఇదీ చూడండి.. తెలుగుతెరపై తాగుబోతు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెస్