ETV Bharat / sitara

లాక్​డౌన్​లో చాలా నేర్చుకున్నా: ప్రభుదేవా - రాధే గురించి ప్రభుదేవా

డ్యాన్సర్​గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా. ఇటీవలే సల్మాన్ ఖాన్​తో తెరకెక్కించిన 'రాధే 'చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

Prabhudeva
ప్రభుదేవా
author img

By

Published : May 25, 2021, 8:48 AM IST

డ్యాన్స‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌భుదేవా. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన 'రాధే' చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ లాక్‌డౌన్ స‌మయాన్ని ఎలా గ‌డిపారో తెలిపారు.

"ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌శాంతంగా ఉండ‌టం, చిన్న చిన్న వాటిని ఆస్వాదించడం ఎలాగో నేర్చుకున్నా. రెస్టారెంట్లు, మల్టీప్లెక్సులు అన్నీ మూతబ‌డ్డాయి. స్నేహితుల్నీ క‌ల‌వ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. కొన్ని వారాల క్రితం క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగాయి. మ‌న‌మంద‌రం వాటిని డిజిట‌ల్ మాధ్య‌మం వేదిక‌గా చూశాం. సినిమాలూ అంతే. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ వినోదాన్ని పొందాలంటే ఓటీటీలే వేదిక‌గా నిలుస్తున్నాయి. నేనూ లాక్‌డౌన్‌లో చాలా సినిమాలు చూశాను. అన్ని ఓటీటీల్లో అందుబాటులో ఉన్న కామెడీ, ప్రేమ‌, యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌.. ఇలా అన్ని త‌ర‌హా చిత్రాలు చూసేశాను" అని చెప్పుకొచ్చారు ప్రభుదేవా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.