ETV Bharat / sitara

విజయ్​ను లైన్​లో పెట్టిన లారెన్స్!

author img

By

Published : May 13, 2020, 5:30 AM IST

ఇలయదళపతి విజయ్​తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్. అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

లారెన్స్
లారెన్స్

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా.. ఇలా ఏ విభాగంలోనైనా తనదైన ప్రతిభ చూపించగలడు రాఘవ లారెన్స్‌. ఎన్నో చిత్రాలకు డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేసిన లారెన్స్‌ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. నాగార్జునతో 'మాస్‌', 'డాన్‌', ప్రభాస్‌తో 'రెబల్‌' చిత్రాలు తెరకెక్కించి డాన్‌ సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించాడు. ఇలాంటి ప్రయత్నమే మరోసారి చేయబోతున్నాడని కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది.

ఇలయదళపతి విజయ్‌తో ఓ చిత్రం చేసేందుకు లారెన్స్ సన్నాహాలు చేస్తున్నాడని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. లోకేశ్‌ కనకరాజన్‌తో 'మాస్టర్‌' చిత్రం చేస్తున్నాడు విజయ్‌. దాని తర్వాత ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక లారెన్స్‌ దర్శకత్వంలో నటిస్తాడని టాక్‌.

హిందీ చిత్రం 'లక్ష్మీ బాంబ్‌' విడుదల చేసే పనిలో ఉన్నాడు లారెన్స్‌. మరోవైపు 'చంద్రముఖి 2'లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలాంటి కథలో విజయ్‌ని చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.