కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులకు ఎప్పుడూ గుర్తుంటాడు. కష్టాలలో ఉన్న వారికి తోచినంత సాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఏడాది గజ తుపాను ప్రభావంతో తమిళనాడులో సుమారు ఏడు జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ విపత్తు సమయంలో ఓ వృద్ద మహిళ నిరాశ్రయురాలైంది. ఆ విషయం లారెన్స్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన ఆ బామ్మకి ఇల్లు కట్టించి ఇచ్చాడు. గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట షేర్ చేశాడు లారెన్స్. ఆ ముసలావిడ పరిస్థితిని తన దృష్టికి తీసుకు వచ్చిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపాడు.
-
Hi dear Friend and Fans..!
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy to share this pic with you all. Many people requested me to help this amma since Gaja cyclone. I’m very happy that the construction is completed. My heartfull Thanks to the boys for bringing this to my knowledge.
“Happy to serve Mother’s” pic.twitter.com/KEgR6WEZjM
">Hi dear Friend and Fans..!
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2019
Happy to share this pic with you all. Many people requested me to help this amma since Gaja cyclone. I’m very happy that the construction is completed. My heartfull Thanks to the boys for bringing this to my knowledge.
“Happy to serve Mother’s” pic.twitter.com/KEgR6WEZjMHi dear Friend and Fans..!
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2019
Happy to share this pic with you all. Many people requested me to help this amma since Gaja cyclone. I’m very happy that the construction is completed. My heartfull Thanks to the boys for bringing this to my knowledge.
“Happy to serve Mother’s” pic.twitter.com/KEgR6WEZjM
గతంలోనూ చిన్నారులకు గుండెకు సంబంధిచిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించడం, విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రకృతి వైపరిత్యాల వలన సర్వస్వం కోల్పోయిన వారికి కొంత సొమ్ముని విరాళంగా ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేశాడు లారెన్స్.