ETV Bharat / sitara

'నాటు నాటు' 30 మిలియన్​ వ్యూస్.. సంపూ 'క్యాలీఫ్లవర్' రిలీజ్ డేట్ - Ghani release date

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, క్యాలీఫ్లవర్, రిపబ్లిక్, అర్జున ఫాల్గుణ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్
author img

By

Published : Nov 13, 2021, 9:48 PM IST

*'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ 30 మిలియన్ల మార్క్​ దాటేసింది. ఇందులో రామ్​చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్సులు అభిమానుల్ని తెగ అలరిస్తున్నాయి. ప్రేమరక్షిత్ కొరియోగ్రాఫీ చేయగా, కీరవాణి ఈ పాటకు సంగీతమందించారు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
.
.

*సాయితేజ్ కలెక్టర్​గా నటించిన చిత్రం 'రిపబ్లిక్'. అక్టోబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్​కు సిద్ధమైంది. నవంబరు 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సాయితేజ్​ సరసన ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్​గా నటించింది. దేవాకట్టా దర్శకత్వం వహించారు.

saitek republic movie OTT
సాయితేజ్ రిపబ్లిక్ మూవీ

*సంపూర్ణేశ్​బాబు హీరోగా నటించిన కొత్త సినిమా 'క్యాలీఫ్లవర్'. ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబరు 26న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు. ఆర్​కే మలినేని దర్శకత్వం వహించగా, ప్రజ్వల్ క్రిష్ సంగీతమందించారు.

.
.

*శ్రీవిష్ణు, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'అర్జున ఫాల్గుణ'. ఈ చిత్రంలోని 'గోదారి వాళ్లే సందమామా' లిరికల్ పాటను శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా శ్రీవిష్ణు నటిస్తున్నారు. తేజ మర్ని దర్శకత్వం వహిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.