ETV Bharat / sitara

ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది! - తారాల ఇన్​స్టా పోస్టులు

తమ కొత్త సినిమా అప్​డేట్లు, జీవితంలో మరచిపోలేని అనుభవాలను పంచుకునేందుకు తారాలు ఇన్​స్టాను వేదికగా ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత ఫోటోలతో, వాటికి అనువైన వ్యాఖ్యలు జోడించి అభిమానులను ఆకట్టుకుంటారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

latest-posts-of-celebrities-in-instagram
ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది!
author img

By

Published : Feb 28, 2021, 5:16 PM IST

టాలీవుడ్‌ నటి సమంత ‘ఏమాయ చేసావే’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శనివారంతో 11 వసంతాలను పూర్తి చేసుకుంది. అదేవిధంగా సమంత కూడా తన 11వ సినీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్రంలోని కొన్ని ఫొటోలను, ఒక వీడియోని పోస్ట్‌ చేసింది. ‘ఏమాయ చేసావే విడుదలై 11 సంవత్సరాలైంది. ఎలాంటి అనుభవం లేకున్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసిన గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్ర నిర్మాత మంజులా ఘట్టమనేని గారికి, హీరో చైతన్యకి ధన్యవాదాలు. అంతేకాదు.. ఈ పోస్ట్‌ చదువుతున్న మీకు కూడా థ్యాంక్యూ. మీ వల్లే నేను ప్రపంచంలోనే సంతోషమైన మహిళగా ఉండగలుగుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.

కోరిక నెరవేరింది..

నటి హిమజ హీరో పవన్‌ కళ్యాణ్‌తో దిగిన ఫొటోలని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఓ మై గాడ్‌.. ఈ రోజుకి నా కోరిక నెరవేరింది. పవన్‌ కళ్యాణ్‌ గారిని తొలిప్రేమ చిత్రంలో చూసినప్పుడు కనీసం ఆయనను ప్రత్యక్షంగా చూస్తానా? అనుకున్నా.. ప్రస్తుతం ఆయన 27వ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ క్రిష్‌ గారికి ధన్యవాదాలు. మీతో పనిచేయడం నా అదృష్టం’ అని రాసుకొచ్చింది.

ఏడాది తర్వాత..

బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ బిపాసా బసు దంపతులు మాల్దీవుల్లో విహరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘దాదాపు సంవత్సరం తర్వాత మాల్దీవులకు వచ్చాం.. ఇక్కడి అందాలు మాలో కొత్త ఉత్తేజాన్ని కలిగించాయి’ అంటూ అక్కడి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

అప్పుడు పసిపాప..

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఇటీవలే రెండోసారి పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సోదరి కరిష్మా.. కరీనా పసిపాపగా ఉన్నప్పటి ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఇది నా సోదరి చిన్నప్పటి ఫొటో. అప్పుడు తను పసిపాప. ఇప్పుడు రెండోసారి మాతృత్వాన్ని పొందింది’ అంటూ సోదరికి శుభాకాంక్షలు తెలిపింది.

శారీ వైబ్స్..

అందాల తార నందినీ రాయ్‌ ‘శారీ వైబ్స్‌’ అంటూ చీర కట్టుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

మెహందీ పండుగ..

అందాల భామ లక్ష్మీ రాయ్‌ ‘మెహందీ పండుగ’ అంటూ రెండు చేతులకు మెహందీ పెట్టుకున్న ఫొటోను పోస్ట్‌ చేసింది.

అవే మంచిరోజులు

బాలీవుడ్‌ తార ఎవ్లీన్‌ శర్మ సంతోషంగా ఉన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మంచి రోజులు వస్తున్నాయి.. వాటినే శనివారం, ఆదివారం అంటారు’ అని రాసుకొచ్చింది.

ఇదీ చూడండి: 'హైదరాబాద్‌లోనే అంతర్జాతీయ స్థాయి టాటూలు అందిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.