Lata mangeshkar news: ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. కరోనా సోకడం వల్ల ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో మంగళవారం చేరారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వయసు దృష్ట్యానే ఐసీయూలో ఉంచినట్లు ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. అలానే వైద్యులు లతా తాజా హెల్త్ అప్డేట్ను విడుదల చేశారు.
"లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మరో 10-12 రోజులు ఆమెను పరిశీలనలో ఉంచనున్నాం. కొవిడ్‌తో పాటు ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నారు" అని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతితీ సమ్దాని అన్నారు.
రెండేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన లతాజీ.. కొన్నిరోజుల తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం కరోనాతో పాటు శ్వాసకోస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో లత సైకత శిల్పాన్ని రూపొందించారు.
1948-78 మధ్య కాలంలో 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు గాయని లతా మంగేష్కర్. ఈమెను భారత ప్రభుత్వం.. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది.
ఇవీ చదవండి: