ETV Bharat / sitara

Aamir Khan: సముద్రతీరంలో మిస్టర్ పర్​ఫెక్ట్... కాకినాడలో ఆమిర్‌ఖాన్‌ సందడి - కాకినాడలో ఆమీర్ ఖాన్

బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాకినాడకు విచ్చేశారు. సముద్రతీర ప్రాంతంలో రెండు రోజుల పాటు జరగనున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు.

lalsingh chadda movie shooting in kakinada
ఆమిర్ ​ఖాన్
author img

By

Published : Aug 13, 2021, 10:19 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం.. రెండు రోజుల పాటు జిల్లాలో చిత్రబృందం ఆయనపై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్​లో చిత్రీకరణ జరగనుంది. షూటింగ్​కు అనువుగా ఆమిర్​ ఖాన్ కాకినాడలోని ఓ హోటల్​లో బస చేస్తున్నారు.

కొవిడ్​ నేపథ్యంలో ఆమిర్​ను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. ఆయన బస చేసిన హోటల్​కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.

1994లో విడుదలైన 'ఫారెస్ట్​ గంప్​' హాలీవుడ్​ సినిమాకు హిందీ రీమేక్​ ఇది. ఇందులో ఆమిర్​ఖాన్​ సరసన కరీనా కపూర్​ నాయికగా నటిస్తోంది. అక్కినేని వారసుడు నాగచైతన్య ఈ సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టనున్నాడు. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టును వదులుకున్న తర్వాత ఆ పాత్రలో అక్కినేని నాగ చైతన్యను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ చిత్రానికి అద్వైత్​ చందన్​ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. క్రిస్​మస్​కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

ఇదీ చదవండి: ఆమిర్​తో చైతూ.. 'మహాసముద్రం' సాంగ్ అప్​డేట్

ఆమిర్​తో చైతూ టీటీ.. వరుస అప్​డేట్స్​తో 'లక్ష్య'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.