కొన్ని రోజులుగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులపైనా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది నటి కంగనా రనౌత్. ఆమె ఓ వివాదాస్పద వ్యక్తి అని తరచూ గొడవలు పెట్టుకుంటుందని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే అది నిజం కాదని అంటోంది కంగన.
"నేను జగడాలు పెట్టుకునే వ్యక్తినని అంటున్నారు. కానీ, ఆ వ్యాఖ్యల్లో నిజం లేదు. నాకు నేనుగా ఏ పోరాటాన్ని ప్రారంభించలేదు. ఒకవేళ నాకు నేనుగా ఏదైన ప్రారంభించానని నిరూపిస్తే ట్విట్టర్ నుంచి తప్పుకుంటా. నేను ఏ గొడవను మొదలుపెట్టను, కానీ ప్రతి పోరాటాన్ని పూర్తి చేస్తా. నిన్ను ఎవరైనా యుద్ధం మొదలు పెట్టమని చెబితే నువ్వు దాన్ని తిరస్కరించు అని శ్రీకృష్ణుడు చెప్పాడు."
- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి
ఏం జరిగిందంటే..
బాలీవుడ్‌లోని ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కంగన పెట్టిన ఓ ట్వీట్‌పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యంగ్యంగా స్పందించాడు.
"నేను ఒక పోరాట యోధురాలిని. కావాలనుకుంటే ప్రాణత్యాగం చేస్తాను. వేరొకరికి తలవంచను. దేశ గౌరవం కాపాడేందుకు తరచూ నా స్వరాన్ని వినిపిస్తుంటా. మర్యాద, ఆత్మగౌరవంతో ఒక జాతీయవాదిగా జీవిస్తుంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువల విషయంలో రాజీపడను.. పడబోను. జైహింద్" అని కంగన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై అనురాగ్ వ్యంగ్యంగా స్పందించాడు.
-
ठीक है मैं बॉर्डर पे जाती हूँ आप अगले अलिम्पिक्स में चले जाना, देश को गोल्ड मडेलस चाहिए हा हा हा यह सब कोई बी ग्रेड फ़िल्म नहीं है जहां कलाकार कुछ भी बन जाता है, आप तो मेटफ़ॉर्ज़ को लिटरली लेने लगे, इतने मंदबुद्धि कबसे हो गए, जब हमारी दोस्ती थी तब तो काफ़ी चतुर थे🙂 https://t.co/TZVAQeXJ43
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ठीक है मैं बॉर्डर पे जाती हूँ आप अगले अलिम्पिक्स में चले जाना, देश को गोल्ड मडेलस चाहिए हा हा हा यह सब कोई बी ग्रेड फ़िल्म नहीं है जहां कलाकार कुछ भी बन जाता है, आप तो मेटफ़ॉर्ज़ को लिटरली लेने लगे, इतने मंदबुद्धि कबसे हो गए, जब हमारी दोस्ती थी तब तो काफ़ी चतुर थे🙂 https://t.co/TZVAQeXJ43
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020ठीक है मैं बॉर्डर पे जाती हूँ आप अगले अलिम्पिक्स में चले जाना, देश को गोल्ड मडेलस चाहिए हा हा हा यह सब कोई बी ग्रेड फ़िल्म नहीं है जहां कलाकार कुछ भी बन जाता है, आप तो मेटफ़ॉर्ज़ को लिटरली लेने लगे, इतने मंदबुद्धि कबसे हो गए, जब हमारी दोस्ती थी तब तो काफ़ी चतुर थे🙂 https://t.co/TZVAQeXJ43
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020
దేశాన్ని కాపాడండి
"కంగనా.. మీరు ఒక మణికర్ణిక. నలుగురు లేదా ఐదుగుర్ని తీసుకువెళ్లి మనదేశంలోకి చొచ్చుకువస్తోన్న చైనాపై పోరాటం చేసిరండి. మీరు ఇక్కడ ఉన్నంత వరకూ దేశాన్ని ఎవరూ ఏం చేయలేరని వాళ్లకు తెలియజేయండి. మీ ఇంటి నుంచి కేవలం ఒక్కరోజు ప్రయాణం చేస్తే ఎల్‌ఏసీ వస్తుంది" అంటూ కామెంట్ చేశాడు.
ఒలింపిక్స్‌లో పతకం తీసుకురండి
అయితే అనురాగ్ చేసిన కామెంట్‌ను కంగన తిప్పికొట్టింది. "దేశ సరిహద్దుల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఒలింపిక్స్‌కు వెళ్లండి. ఎందుకంటే దేశం స్వర్ణ పతకాలు కోరుకుంటోంది. గుర్తుపెట్టుకోండి..! అది మీరు తెరకెక్కించే బీ గ్రేడ్ ఫిల్మ్ కాదు" అని కంగన కౌంటర్ ఇచ్చింది.