నాలుగు విభిన్న ప్రేమకథలు.. నలుగురు ప్రముఖ దర్శకులతో ఓ వైవిధ్యభరిత వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. 'కుట్టి లవ్‌స్టోరీ' పేరుతో రూపొందిస్తున్నారు. వేల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. దీని టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నాలుగు భిన్నమైన ప్రేమ కథాంశాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టీజర్లో చూపించారు.
ప్రముఖ దర్శకులు గౌతమ్ మేనన్, వెంకట్ ప్రభు, విజయ్, నలన్ కుమారస్వామి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఒక్కో భాగాన్ని 30 నిమిషాల నిడివితో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వీటిలో చేస్తున్న నటీనటులెవరు అనేది వెల్లడించలేదు. దీనిని త్వరలో ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">