'ఉప్పెన' చిత్రంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది కృతిశెట్టి. అరంగేట్రంలోనే అదిరిపోయే పర్ఫామెన్స్తో కుర్రాల గుండెల్లో అభిమాన నటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో యువ మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో నటించిన ఈ భామ.. తాజాగా ఇతడి అన్నయ్య సాయి ధరమ్ తేజ్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందని సమాచారం.
కార్తిక్ వర్మ దర్శకత్వంలో తేజ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కృతిశెట్టిని సంప్రదించారట. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.