తొలిసినిమాతోనే సూపర్‌హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కథానాయిక కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన 'ఉప్పెన'లో ఆమె వైష్ణవ్‌తేజ్ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. మొదటి సినిమానే అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ఆమె నటించిన విధానం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కృతి చిన్నతనంలోనే కెమెరా ముందు తళుక్కున మెరిసింది.
స్కూల్‌కు వెళ్లే వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో కృతిశెట్టి పాల్గొంది. అనంతరం 'లైఫ్‌బాయ్', 'డైరీమిల్క్ చాక్లెట్'తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో కూడా ఆమె నటించింది. హృతిక్‌రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన 'సూపర్ 30'లో సైతం కృతిశెట్టి ఓ సన్నివేశంలో కనిపించింది. మన బేబమ్మ నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను మీరూ ఓసారి చూసేయండి..!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఉప్పెన'లో కృతి అలా ఎంపికైంది