కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా సినిమాలు మళ్లీ ఓటీటీల బాట పడుతున్నాయి. హీరోయిన్ కృతిసనన్ ప్రధానపాత్రలో నటించిన 'మిమీ' కూడా ఓటీటీవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సరోగేట్ తల్లిగా ఈ చిత్రంలో కృతి నటిస్తోంది.
ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని గతేడాది నుంచీ ఎదురుచూస్తున్నారు. కానీ వీలు కాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక ఓటీటీలోనే విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
"ఓ ప్రముఖ ఓటీటీ 'మిమీ' చిత్రాన్ని మంచి ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే సెకండ్ వేవ్ తీవ్రతగా ఎక్కువగా ఉంది. థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేయడయే మంచిదని చిత్ర నిర్మాత దినేశ్ విజన్ భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది" అని దినేశ్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.
ఇదీ చూడండి: 'ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజ్కు ముహూర్తం ఖరారు?