ETV Bharat / sitara

ప్రభాస్​ సిగ్గరి అనుకున్నా.. కానీ: కృతిసనన్​ - ఆదిపురుష్ కృతిసనన్​

రెబల్​స్టార్ ప్రభాస్​తో కలిసి నటిస్తున్న 'ఆదిపురుష్'​ సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది హీరోయిన్​ కృతి సనన్​. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు ఓం రౌత్​ను ప్రశంసించింది.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Mar 24, 2021, 4:33 PM IST

ఓం రౌత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో రాముడిగా ప్రభాస్​, సీతగా కృతి సనన్​ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోందీ చిత్రం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. సినిమా సహా ప్రభాస్​ గురించి పలు విషయాలు పంచుకుంది. తొలిసారి ప్రభాస్​ను కలిసినప్పుడు ఆయన సిగ్గరి అని తాను భావించినట్లు చెప్పింది. కానీ ఆ తర్వాత తామిద్దరం బాగా కలిసిపోయామని, పలు విషయాల గురించి కూడా చర్చించుకున్నట్లు తెలిపింది. దర్శకుడు ఓం రౌత్​ను ప్రశంసించింది కృతి​. ఓ మంచి దర్శకుడి పర్యవేక్షణలో తాను నటిస్తున్నట్లు వెల్లడించింది. నటన తప్ప మరే ఇతర విషయాల గురించి చింతించట్లేదని చెప్పుకొచ్చింది.

"తొలిసారి ప్రభాస్​ను కలిసినప్పుడు సిగ్గరి అని అనుకున్నా. కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాక చెప్పలేనన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన ఆహార ప్రియుడు. సహ నటులకు కూడా రకరకాల వంటకాలు తినిపించడానికి చాలా ఇష్టపడతారు. ఇక 'ఆదిపురుష్'​ లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలో సీత వంటి ఐకానిక్​ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో గొప్పగా, బాధ్యతగా భావిస్తున్నా. ఈ అవకాశం వచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎంతో ఒత్తిడితో కూడి ఉన్న పాత్ర ఇది. ఎందుకంటే వాస్తవానికి వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ పాత్రను తీర్చిదిద్దాలి" అని కృతి వెల్లడించింది.

ఈ చిత్రంలో రావణుడిగా బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్ నటిస్తుండగా, మరో నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్​ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'ఆదిపురుష్'​ను తెరకెక్కించడం చాలా కష్టం: ఓం ​రౌత్

ఇదీ చూడండి: 'ఆదిపురుష్'లో ప్రభాస్‌కు జోడీగా కృతి ఫిక్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.