హీరో రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశాడు హీరో విక్టరీ వెంకటేష్. ఈ చిత్రాన్ని 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రాశాడు రచయిత రవికాంత్. అభినవ కృష్ణుడు లాంటి ఓ యువకుడి జీవిత గమనానికి దృశ్యరూపమిది. పలువురు అందాల భామలతో ప్రేమలో ఉన్న అతడి కథేమిటి? రాంగ్‌టైమ్ రిలేషన్‌షిప్స్ కారణంగా హీరో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడన్నది ఆసక్తిని పంచుతుంది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చుతున్నాడు.
పులిహోర కలిపెనులే... అంటూ సాగే పాట టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పాటని గుర్తుచేస్తూ 'పులిహోర కలపండమ్మా...’ అని చిత్ర బృందాన్ని ట్విట్టర్ ద్వారా ఉత్సాహపరిచాడు వెంకటేష్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: లవర్స్ డే: టాలీవుడ్లో ప్రేమికుల సినిమా సందడి