ETV Bharat / sitara

ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రవితేజ 'క్రాక్'​ విడుదల?

రవితేజ హీరోగా గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో రూపొందిన సినిమా 'క్రాక్'​. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్​ఫామ్​ వేదికగా విడుదల కానున్నట్లు సమాచారం.

Krack: Ravi Teja and Shruti Haasan's film to get a direct OTT release?
ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రవితేజ 'క్రాక్'​ విడదల?
author img

By

Published : Jul 15, 2020, 5:35 AM IST

గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో మాస్​ మహారాజా రవితేజ.. ముచ్చటగా మూడోసారి నటిస్తున్న చిత్రం 'క్రాక్'​. ఈ వేసవిలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. మరోవైపు థియేటర్లు తిరిగి తెరుచుకోవడంపై అనిశ్చితి నెలకొన్న వేళ.. చిత్ర నిర్మాతలు డిజిటల్​వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ అభిమానులను సొంతం చేసుకున్న రవితేజ 'క్రాక్'​ సినిమాను.. ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'క్రాక్'​ నిర్మాత బి.మధు స్ట్రీమింగ్​ హక్కులను విక్రయించేందుకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ చిత్రంలో రవితేజ సరసన కథానాయిక శ్రుతిహాసన్​ నటించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్​లో కనిపించనుందీ హీరోయిన్​. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వరలక్ష్మీ శరత్​కుమార్​, అలీ, దేవీప్రసాద్​ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్​.ఎస్​. తమన్​ స్వరాలు సమకూర్చాడు. గతంలో రవితేజ-గోపీచంద్ మలినేని‌ కాంబినేషన్‌లో వచ్చిన 'డాన్‌శీను', 'బలుపు' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.