Kotikokkadu 3 release date: సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం 'కే3 కోటికొక్కడు'. శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలు. ఈ సినిమాను ఫిబ్రవరి 4న తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఆదివారం ప్రకటించారు.
"మంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. కన్నడలో విడుదల చేసిన తొలి నాలుగు రోజుల్లోనే రూ.40కోట్లు వసూలు చేసింది. అందుకే ఇప్పుడు దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇందులో సుదీప్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. మడోన్నాతో ఆయన కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది" అని నిర్మాతలు తెలిపారు. ఆషికా రంగనాథ్ ప్రత్యేక గీతంలో నర్తించింది.
Ajith mohanlal movie: పాత్ర నచ్చాలే కానీ ఏ భాషలోనైనా ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి ముందుంటారు ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్. ఆయన ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్ 61వ సినిమా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులోని ఓ కీలక పాత్రలో మోహన్‌లాల్ నటించబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అజిత్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోహన్‌లాల్ నటించిన 'మరక్కర్' సినిమా సెట్లో కూడా అజిత్ సందడి చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: