ఓ స్టార్ డైరెక్టర్ తలుచుకుంటే ఎలాంటి సినిమాలు అయినా చేయొచ్చు. కానీ కళారంగంలో ఉన్నపుడు కచ్చితంగా ప్రజలకు మంచి చెప్పాలని ఆలోచించే దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవలోకి వచ్చే దర్శకుడు కొరటాల శివ. ఈయన ఇప్పటి వరకు చేసినవన్నీ సందేశాత్మక చిత్రాలే.
ఆయన సినిమాలు ప్రజల్లో అవగాహన కలిగించేలా ఉంటాయి. ఏదో ఒక మంచి చెప్తూనే ఉంటాడు. అవి తెరపై చూపుతుంటాడు. అయితే తెరపై చూపడమే కాదు.. స్వయంగా చేతనైన సేవలు చేస్తుంటాడు. తాజాగా ఈ దర్శకుడు పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ]
"సేవ్ వాటర్" అంటూ వర్షం నీటిని కాపాడుతున్నాడీ దర్శకుడు. తన ఇంట్లో వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఓ ఇంకుడుగుంతను నిర్మించాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఒక్క చుక్క నీటిని కూడా వృథా కానివ్వకుండా చేద్దామంటూ పిలుపునిచ్చాడు కొరటాల.
ఇదీ చూడండి : హిందీ 'టాక్సీవాలా' తూచ్.. ఇదుగో క్లారిటీ..