ETV Bharat / sitara

బన్నీతో ఆ దర్శకుడు... కొత్త కాంబినేషన్?

author img

By

Published : Jun 12, 2020, 7:01 AM IST

హీరో అల్లు అర్జున్, దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచేయనున్నారట. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

బన్నీతో ఆ దర్శకుడు... కొత్త కాంబినేషన్?
హీరో అల్లు అర్జున్

వెండితెరపై సరికొత్త కలయికకు రంగం సిద్ధమవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడిది కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే కొరటాల తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీళ్లిద్దరి కలయికలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ALLU ARJUN KORATALA SHIVA
అల్లు అర్జున్- దర్శకుడు కొరటాల శివ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.