బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రయాంట్కు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బుధవారం నివాళులు అర్పించింది. హెలీకాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్, అతని కుమార్తె జియానాతో పాటు మరో ఏడుగురు మరణించారు. కోబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆస్కార్ నామినీదారులంతా సోమవారం ఒక్క క్షణం మౌనం వహించారు. కోబ్ బ్రయాంట్ మృతి పట్ల చింతిస్తూ అకాడమీ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఒక పిల్లవాడు నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్లో అడుగుపెట్టగలడా అని అనుమానించారు.. కానీ, బ్రయాంట్ వాటిని తప్పుగా నిరూపించాడు. అతను ఛాంపియన్‌షిప్ గెలవగలడా అని సందేహపడ్డారు.. మళ్లీ అతను వాటిని తప్పుగా నిరూపించాడు. సినిమాలు చేయగలడా వారు అనుమానం వ్యక్తం చేశారు.. బ్రయాంట్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. అందరు గొప్ప కళాకారుల మాదిరిగానే, కోబ్ బ్రయాంట్ కూడా సందేహాలు వ్యక్తం చేసేవారిని తప్పుగా నిరూపించాడు."
- అకాడమీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సారాంశం.
'డియర్ బాస్కెట్బాల్' అనే యానిమేటెడ్ చిత్రానికి రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోబ్ బ్రయాంట్ 2018లో అకాడమీ అవార్డును సాధించాడు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 9న జరగనుంది.
ఇదీ చూడండి...హృదయాల్లో నిలిచి... లోకాన్ని విడిచిన బ్రయాంట్