సుశాంత్ మానసిక ఒత్తిడి కారణంగా మృతి చెందాడని నమ్మించే విధంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రవర్తించిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా సోషల్‌మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.
సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న తర్వాత దీపిక తన ట్విట్టర్లో మానసిక ఒత్తిడిపై పలు సిద్ధాంతాలను వెల్లడించింది. ఆ ట్వీట్లు జూన్ 21 వరకు కొనసాగాయి. ఆ తర్వాత సుశాంత్ మృతిపై నటి మౌనంగా ఉండిపోయింది. అయితే వాటిపై సుశాంత్ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇంతలోనే దీపిక మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని జపించడం మొదలుపెట్టింది. వైద్యులు అదృశ్యమయ్యారు. మహారాష్ట్ర డీసీపీ సుశాంత్‌ది ఆత్మహత్య అని ఖరారు చేశారు. సిస్టమ్‌లో ఏదో తప్పు జరుగుతోంది" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
"ప్రియమైన దీపికా పదుకొణె.. మీరు నిరాశకు లోనవుతున్నారని అనిపిస్తుందా?" అని మరొకరు రిప్లై ఇచ్చారు.
"సుశాంత్ మృతి తర్వాత మానసిక ఒత్తిడి పేరుతో స్పందించడం వల్ల ప్రజలు దీపికను ద్వేషిస్తున్నారు. ఇలాంటి పని చేసినందుకు మీరు సిగ్గుపడాలి. ఇలాంటి అమానవీయమైన పని ఎలా చేశారు?" అని సుశాంత్ అభిమాని ట్వీట్ చేశారు.
"నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతాను. కానీ, మీరు చెప్పిన మానసిక ఒత్తిడి సిద్ధాంతం తర్వాత మీకు అభిమానిగా ఉన్నందుకు బాధపడుతున్నా. మీరు నిజంవైపు ఉండకపోయినా పర్వాలేదు. కానీ, ఇలాంటి అర్థంలేని సిద్ధాంతాలు చెప్పొద్దు" అని మరో నెటిజన్ స్పందించారు.
"నా తర్వాత ఇలా చేయండి!! డిప్రెషన్ అనేది విలాసవంతమైనది కాదు. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని ఉపయోగించకూడదు" అని దీపికా పదుకొణె స్టైల్లో ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు.