ETV Bharat / sitara

'ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు'

కెరీర్​ పరంగా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది హీరోయిన్​ కియారా అడ్వాణీ. జీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

author img

By

Published : Dec 16, 2020, 10:13 PM IST

kiyara
కియారా

బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ వెండితెరపైకి వచ్చి ఆరేళ్లు దాటిపోయింది. తన తొలి చిత్రం 'ఫగ్లీ'తో వెండితెర అరంగేట్రం చేసిన కియారా ఈ మధ్య విడుదలైన 'ఇందూ కి జవానీ' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్​ గురించి పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది.

"నేను కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను చాలా మంది దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఆ జాబితా నా దగ్గర ఉంది. నేను ఎలాంటి పాత్రలు చేయగలనో, ఏ రకమైన పాత్రలు పోషించగలనో నాకు తెలుసు. కొంతమంది అడిగినట్లు తక్కువ సమయంలోనే ఇంత పేరు, విజయాలు సాధించారా? అని అడిగితే చెప్పలేను. కొన్ని పాత్రలు నేను చేయగలనని నమ్మారు. అందరి సహకారంతో ఎలాంటి పాత్రలైన చేయగలుగుతున్నా."

-కియారా అడ్వాణీ, కథానాయకురాలు.

ప్రస్తుతం సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి 'షేర్షా' చిత్రంలో నటిస్తోంది కియారా. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా వస్తున్న 'భూల్‌ భులయ్యా 2'లోనూ నటించింది. ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతోపాటే వరుణ్​ ధావన్​ హీరోగా రాబోతున్న 'జుగ్​ జుగ్​ జీయో' సినిమాలోనూ కనువిందు చేయనుంది.

ఇదీ చూడండి : 'తొలి ప్రేమను మర్చిపోవడం చాలా కష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.