బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా రానున్న 'క్రిష్ 4' సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బటకొచ్చింది. ఇందులో ఇద్దరు కథనాయికలను చోటుంది. అందులో ఒక నాయికగా కృతిసనన్ అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్లు ఖాళీ లేకపోవడం ఆ అవకాశం కియారా అద్వానీకి వచ్చిందని తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని హృతిక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హృతిక్-కియారా కాంబినేషన్ కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన 'జవానీ కీ దివానీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : నాలుగో 'క్రిష్' కోసం నాలుగు పాత్రల్లో హృతిక్!