హీరో ఎన్టీఆర్ 30వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారా? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు కొరటాల శివ అని సమాధానం దొరికేసింది. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రానికి సంబంధించి మరో సందేహం ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరై ఉంటారు? అని చర్చించుకోవడం ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కియారా అడ్వాణీ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్‌కు జోడీగా ఈ భామ బావుంటుందని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే ఆమెతో సంప్రదింపులు జరిపే అవకాశముందని తెలుస్తోంది.
తొలుత ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టును త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సింది. అప్పుడు ఈ సినిమా కోసం పూజాహెగ్డే, జాన్వీ కపూర్, రష్మిక మందాన, కియారా అడ్వాణీ పేర్లు బయటకొచ్చాయి. వీరిలో ఒకరిని తీసుకోవాలని భావించారు. గతంలో తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన కియారా.. ప్రస్తుతం 'షేర్షా', 'భూల్ భులయ్యా 2', 'జుగ్ జుగ్ జీయో', 'మిస్టర్ లేలే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదీ చూడండి: కొరటాల శివతో ఎన్టీఆర్ 30వ సినిమా ఫిక్స్