విభిన్న చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోని మరో వైవిధ్య కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'కిల్లర్' టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. కిల్లర్ ప్రభాకర్ పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. పవర్ఫుల్ పోలీస్ పాత్రతో ఆకట్టుకునేందుకు యాక్షన్ కింగ్ అర్జున్ సిద్ధమవుతున్నాడు.
ఎన్ని హత్యలైనా చేయడానికి నేను రెడీ అంటూ విజయ్ ఆంటోని చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.
అషిమా నర్వాల్ కథానాయిక. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. సైమన్ కే సింగ్ సంగీతమందించాడు. మర్డర్ మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">