కన్నడ నటుడు సుదీప్ కిచ్చ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన 'ఫాంటమ్' సినిమా చిత్రీకరణను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం తిరిగి ప్రారంభించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆయన అభిమానులతో ట్విటర్‌లో పంచుకున్నారు. 'ఈ రోజు నా ముఖానికి రంగులద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అంటూ ట్వీటారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
-
Putting on makeup today was an awesome feel. Felt I was in an elaborated holiday away frm my passion. A passion called cinema.
— Kichcha Sudeepa (@KicchaSudeep) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
So here iam.....
being,,,,,,, VIKRANTH RONA ,,,again.#PhantomBegins pic.twitter.com/eoxNqpP3sn
">Putting on makeup today was an awesome feel. Felt I was in an elaborated holiday away frm my passion. A passion called cinema.
— Kichcha Sudeepa (@KicchaSudeep) July 19, 2020
So here iam.....
being,,,,,,, VIKRANTH RONA ,,,again.#PhantomBegins pic.twitter.com/eoxNqpP3snPutting on makeup today was an awesome feel. Felt I was in an elaborated holiday away frm my passion. A passion called cinema.
— Kichcha Sudeepa (@KicchaSudeep) July 19, 2020
So here iam.....
being,,,,,,, VIKRANTH RONA ,,,again.#PhantomBegins pic.twitter.com/eoxNqpP3sn
ఇటీవలే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరాలో నటించిన సుదీప్... ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్‌తో 'దబాంగ్ 3'లో కనిపించాడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ కీలకపాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుదీప్ పోలీసు అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ', 'బాహుబలి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు కిచ్చా సుదీప్.