"ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత వాటి గురించి ఆలోచనే ఉండదు" అంటోంది కియారా అడ్వాణీ. త్వరలో ఈ భామ 'కబీర్ సింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటల్లో.. షాహిద్ - కియారా మధ్య వచ్చే ఘాటైన అదరచుంబనాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని లిప్‌లాక్‌ల ముచ్చట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది కియారా.
" చిత్ర ప్రచార వీడియోల్లో ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సీన్స్ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమాలోని లిప్‌లాక్ సన్నివేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమిద్దరం చాలా సింపుల్‌గా పూర్తి చేసేశాము. ఎందుకంటే ఆ ముద్దు సీన్స్ కథలో ఒక భాగంగానే ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువ కష్టపడాల్సింది ఏముంటుంది. లిప్‌లాక్ సీన్స్ తీస్తున్న సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత నాకు వాటి గురించి ఆలోచనే ఉండదు. అలాంటి సన్నివేశాలను చాలా తేలికగా షూట్ చేసేయడం వల్ల వాటి గురించి తర్వాత ఆలోచించాల్సిన అవసరం రాదు ".
-- కియారా అడ్వాణీ, సినీ నటి
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలోకి రాబోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి..