కియరా అడ్వాణీ... ఆ పేరు వింటే చాలు నిలువెత్తు అందంతో ఓ బార్బీ బొమ్మ రూపం గుర్తొస్తుంది. బాలీవుడ్, తెలుగు తెరలపై తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ కుర్రకారుల కలల రాణిగా మారింది.
ఆ ముద్దుగుమ్మ ధోనీ చిత్రంలో లక్షణంగా కనిపించినా... 'లస్ట్ స్టోరీస్'లో విభిన్నమైన నటన చూపి అభిమానుల్ని అలరించింది. 'భరత్ అను నేను'లో ప్రిన్స్‌తో సందడి చేసినా.. చివరికి కబీర్ సింగ్‌లో ప్రీతిగా అదరచుంభనాలతో అలరించినా ప్రేక్షకులు జై కొట్టారు. ఎందుకంటే సౌందర్యమైన రూపానికి సుందరమైన పేరు ఆమెది.
ఇంతగా పేరు తెచ్చుకొన్న కియారా... తన అసలు పేరు అలియా అంటూ బాంబు పేల్చింది.
" 2014లో వెండితెరపై అడుగుపెట్టినపుడే నా పేరు కియరాగా మార్చుకున్నా. మొదట నా పేరు అలియా. అప్పటికే అలియా భట్ మంచి పేరు తెచ్చుకోవడం వల్ల అభిమానులకు గందరగోళం లేకుండా ఉండేందుకే ఆ పని చేశా. నాకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే నేను అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నా".
-- కియరా అడ్వాణీ, బాలీవుడ్ నటి
కియరాగా పేరు మార్చుకోవడానికి ప్రియాంక చోప్రా కారణమని ఓ సంఘటన చెప్పుకొచ్చింది.
" ప్రియాంక నటించిన 'అంజానా అంజనీ' చిత్రం చూస్తున్నాను. హాయ్.. నేను కియరా అంటూ పరిచయం చేసుకుంటుంది ప్రియా. ఆ పేరు వినగానే బాగా నచ్చింది. నాకు పిల్లలు పుడితే ఆ నామకరణమే చేయాలనుకున్నా. నాకు ఆ పేరు కావాలనిపించింది. అందుకే వెంటనే మార్చేసుకున్నా" అని చెప్పిందీ అందాల కియరా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'కబీర్ సింగ్' చిత్రంలో కియరా కథానాయిక. ఈ సినిమా విడుదలై నెల రోజులైంది. ప్రస్తుతం రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దాదాపు రూ. 260 కోట్ల వసూళ్లు సాధించింది. రూ. 200 కోట్ల క్లబ్లో 'కబీర్ సింగ్' చేరడంపై సంతోషం వ్యక్తం చేసింది కియరా. ఈ విజయం తనకు మరింత కష్టపడేందుకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె చేతిలో వరుస సినిమాలున్నాయి. 'గుడ్‌న్యూస్', 'లక్ష్మీ బాంబ్', 'షేర్షా', 'ఇందూ కి జవానీ' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.