యావత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' (KGF chapter 2). పాన్ ఇండియా స్థాయిలో యశ్ (yash) కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్నారు. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7న విడుదలైన ఈ సినిమా టీజర్ (KGF chapter 2 teaser record) సరికొత్త రికార్డు సృష్టించింది.
అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక కామెంట్లు (యూట్యూబ్‌లో) పొందిన తొలి కన్నడ టీజర్‌గా నిలిచింది. 10 లక్షల మంది (1 మిలియన్) ఈ టీజర్‌పై కామెంట్ చేశారు. 188 మిలియన్స్‌కి పైగా వీక్షణలు, 8 మిలియన్స్‌కిపైగా లైక్స్ సొంతం చేసుకుంది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యశ్- ప్రశాంత్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'కేజీఎఫ్ ఛాప్టర్ 1' అఖండ విజయం అందుకోవడం వల్ల ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు.