ETV Bharat / sitara

కేజీఎఫ్-2​లో 'అధీరా'గా సంజయ్ దత్..! - అధిరా లుక్

కేజీఎఫ్​-2లో ప్రతినాయకుడు 'అధీరా'గా సంజయ్​దత్​ కనిపించనున్నాడని సమాచారం. ఆ పాత్ర ప్రీలుక్​ను​ చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 29న ఫస్ట్​లుక్​ రిలీజ్​ చేస్తారు.

కేజీఎఫ్-2​లో 'అధిరా'గా సంజయ్ దత్..!
author img

By

Published : Jul 26, 2019, 1:59 PM IST

కేజీఎఫ్... యశ్​ హీరోగా నటించిన కన్నడ సినిమా. ఆ ఒక్క భాషకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. సుమారు రూ.250 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తీస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ చిత్రంలోని ప్రతినాయకుడి పాత్ర 'అధీరా' ప్రీలుక్​ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. కేవలం 'సింహపు ఉంగరం'తో ఉన్న పిడికిలిని మాత్రమే చూపించారు. ఈ నెల 29న సినిమా ఫస్ట్​లుక్​ రిలీజ్​ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్​ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ADHEERA PRE LOOK FROM KGF2
కేజీఎఫ్​2లో ప్రతినాయకుడు 'అధిరా' ప్రీలుక్

శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ సీక్వెల్​లో 'అధీరా'గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్​ కనిపించనున్నాడని సమాచారం. అతడి పుట్టినరోజు, తొలిరూపు విడుదల చేసేది ఒకరోజు (జులై 29) కావడం దీనికి ప్రధాన కారణమని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇది చదవండి: భారీ సెట్స్​లో 'కేజీఎఫ్​2' షూటింగ్​!

Intro:Body:

e

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.