ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' షూటింగ్​.. 10 రోజులు మాత్రమే - కేజీఎఫ్ 2 షూటింగ్

ఆగస్టు 26 నుంచి దాదాపు 10 రోజుల పాటు జరిగే షెడ్యూల్​లో 'కేజీఎఫ్ 2' బృందం పాల్గొనుంది. అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'కేజీఎఫ్ 2' షూటింగ్​.. 10 రోజులు మాత్రమే
కేజీఎఫ్ 2లో యష్
author img

By

Published : Aug 21, 2020, 8:47 PM IST

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న 'కేజీఎఫ్ 2' షూటింగ్ ఆగస్టు 26 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో దాదాపు 10 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్​తో క్లైమాక్స్​ ఫైట్ మినహా మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయినట్లే. ఇందులో ప్రకాశ్​రాజ్, మాళవిక తదితరులు పాల్గొనున్నారు.

prasanth neel
షూటింగ్​లో దర్శకుడు ప్రశాంత్ నీల్(పాత చిత్రం)

తొలి భాగం బ్లాక్​బస్టర్​గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ప్రతినాయకుడు అధీరాగా బాలీవుడ్​ స్టార్ సంజయ్​ దత్ నటిస్తుండటం విశేషం. ఇటీవలే ఆయన ఫస్ట్​లుక్​ కూడా విడుదలై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. యష్​ సరసన శ్రీనిధి శెట్టి కనిపించనుంది. రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

sanjay dutt as adheera
అధీరా లుక్​లో సంజయ్​దత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.