ETV Bharat / sitara

'మోదీజీ.. కేజీఎఫ్​- 2 రిలీజ్​ రోజు సెలవు ప్రకటించండి' - 'కేజీఎఫ్-2' రిలీజ్‌కు పబ్లిక్​ హాలీడే

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కథానాయకుడిగా నటించిన 'కేజీఎఫ్‌-2' సినిమా ఈ ఏడాది జులై 16న విడుదల కానుంది. ఆ రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి ట్వీట్​ చేశాడు ఓ అభిమాని. ఆ ట్వీట్​ వైరల్​గా మారింది.

modi
మోదీ
author img

By

Published : Feb 1, 2021, 10:47 PM IST

Updated : Feb 1, 2021, 10:55 PM IST

కన్నడ స్టార్‌హీరో యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కేజీఎఫ్‌-2'. రెండేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన 'కేజీఎఫ్‌'కు స్వీకెల్‌గా ఈ సినిమా రాబోతుంది. అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జులై 16న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

చిత్రబృందం ప్రకటనతో సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని బయటపెడుతున్నారు యశ్‌ అభిమానులు. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. 'కేజీఎఫ్‌-2' రిలీజ్‌ డేట్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జులై 16న సెలవు ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్‌ చేశారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్‌- 2' ఈ ఏడాది జులై 16న విడుదలవుతున్న విషయం తెలిసిందే. సినీ ప్రియులందరూ ఆ సినిమా కోసం ఎప్పటినుంచే నిరీక్షిస్తున్నారు. ఆ సినిమా విడుదలయ్యే రోజున దయచేసి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని మేము కోరుతున్నాం. మా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అది కేవలం సినిమా మాత్రమే కాదు మా ఎమోషన్‌' అని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Last Updated : Feb 1, 2021, 10:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.