ETV Bharat / sitara

'ఆ హీరోతో నటిస్తానని చిన్నప్పుడే సవాల్​ చేశా' - కీర్తిసురేశ్ లేటెస్ట్ న్యూస్

ఇప్పటివరకు తాను కలిసి నటించిన హీరోల గురించి నటి కీర్తి సురేశ్​ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. పవన్​ కల్యాణ్​ నటనకు ఫిదా అయ్యానని, సూర్యకు పెద్ద అభిమానిని అని చెబుతున్న కీర్తి.. ఇంకేం చెప్పిందంటే...

Keerthy suresh about her co-stars
కీర్తిసురేశ్
author img

By

Published : Jul 18, 2021, 7:40 AM IST

కీర్తీసురేశ్.. వెండితెరకు పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్న ప్రతిభావని. 'సర్కారు వారి పాట'లో మహేశ్​బాబుతో జోడీ కట్టే ఛాన్స్‌ కొట్టేసిన ఈ మలయాళీ కుట్టి ఇప్పటవరకూ తాను కలిసి నటించిన హీరోల గురించి వివరిస్తోందిలా..

పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వం నచ్చుతుంది

ఒకప్పుడు మా అమ్మ, చిరంజీవితో కలిసి 'పున్నమి నాగు'లో నటిస్తే నేనేమో పవన్‌కల్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' చేశా. నా మూడో సినిమా తనతో కలిసి చేస్తున్నానని తెలిసినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేశా. అంతకన్నా ముందే ఆయన సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ఆయన్ని పవర్‌స్టార్‌ అని ఎందుకు అంటారో తనతో కలిసి నటిస్తున్నప్పుడు అర్థమయ్యింది. మా సినిమా పూర్తయ్యాక నేను తన నటనకే కాదు వ్యక్తిత్వానికి కూడా ఫిదా అయ్యానంటే నమ్మండి. అవకాశం వస్తే మరోసారి పవన్‌కల్యాణ్‌తో కలిసి తెర పంచుకోవాలని ఉంది.

pawan kalyan
పవన్ కల్యాణ్

నాని రుణం తీర్చుకోలేను

నాకు 'నేను లోకల్‌' సినిమా అవకాశం వచ్చినప్పుడు మా అక్క.. 'తెలుగులో నానిని నేచురల్‌ స్టార్‌ అంటారు. నిజంగా అతని నటన చాలా సహజంగా ఉంటుంది..' అని చెబితే కాస్త భయపడ్డా. కానీ షూటింగ్‌ మొదలయ్యాక ఎలాంటి కష్టమైన సన్నివేశాన్నయినా నాని చాలా సులువుగా నటించడం చూసి 'అలా ఎలా చేస్తాడబ్బా' అనుకునేదాన్ని. షూటింగ్‌ విరామంలో నేను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఎంత విసిగించినా చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవాడు. 'మహానటి'లో నన్ను తీసుకోవాలనుకున్నప్పుడు నాని నాకు ఫోన్‌ చేసి ఆ సినిమా గురించి చెబుతూనే 'నీకు మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు చేస్తే బాగుంటుంది' అని చెప్పాడు. నేను మహానటిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నానంటే నా మొదటి థ్యాంక్స్‌ నానికే చెబుతా. అతని రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.

nani
నాని

సూర్యకు పెద్ద అభిమానిని!

స్కూల్లో చదువుకుంటున్నప్పటినుంచీ నేను సూర్యకు పెద్ద అభిమానిని. మా అమ్మ, సూర్య వాళ్ల నాన్న శివకుమార్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. అమ్మ ఎప్పుడు ఆ సినిమాల ప్రస్తావన తెచ్చినా 'చూస్తుండు.. నేను కూడా ఏదో ఒక రోజు సూర్యతో కలిసి నటిస్తాను' అని అమ్మతో సవాలు చేసేదాన్ని. ఆ మాటలు 'గ్యాంగ్‌'తో నిజమయ్యాయి. ఆయన సెట్లో ఉన్నంతసేపూ తనకు సంబంధించిన సీన్లపైనే దృష్టిపెడతారు. ఏదైనా సందేహం అడిగితే మాత్రం తప్పకుండా మంచి సలహా ఇస్తారు. సహనటుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు.

suriya
సూర్య

రామ్‌ చాలా ఎనర్జెటిక్‌

నా మొదటి సినిమా 'నేను శైలజ' నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రామ్‌ నటన, డాన్స్‌ చేసే విధానం అన్నీ అద్భుతమే. సెట్లో చాలా ఎనర్జెటిక్‌గా ఉంటాడు. ఒక షాట్‌ పూర్తయ్యాక తన నటనను మానిటర్‌లో గమనించుకుంటాడు. ఒకవేళ ఆ సీన్‌ మళ్లీ చేయాల్సి వచ్చినా విసుగు లేకుండా నటిస్తాడు. పని విషయంలో ఎంత నిబద్ధతతో ఉంటాడో.. ఆరోగ్యం విషయం లోనూ అంతే శ్రద్ధగా ఉంటాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు తనను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా.

ram pothineni
రామ్

దుల్కర్‌ నటనకు హ్యాట్సాఫ్‌

'మహానటి'లో అందరూ నా నటనను మెచ్చుకుంటే నేను మాత్రం దుల్కర్‌ నటించిన విధానం చూసి 'వావ్‌' అనుకున్నా. నేను అప్పటికే కొన్ని తెలుగు సినిమాలు చేశాను కానీ, మహానటి తనకు మొదటి అవకాశం. దాంతో ఎలా నటిస్తాడో అనుకునేదాన్ని. అలాంటి దుల్కర్‌ ఆ సినిమాలో తనని తాను నిరూపించుకునేందుకు ప్రతి సీన్‌నూ ప్రాణం పెట్టి చేశాడు. కొన్ని సీన్లలో నేను అతనితో పోటీ పడగలనా అనిపించేంత సహజంగా నటించి అందరి ప్రశంసలూ అందుకున్నాడు.

dulqar salman
దుల్కర్ సల్మాన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.