నటి కీర్తి సురేశ్.. పల్లెటూరి పిల్లగా మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా 'గుడ్‌లక్ సఖి'. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాలను పెంచుతోంది.
దురదృష్టానికి దగ్గరగా ఉన్న సఖికి, కనీసం పెళ్లి జరగడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా ప్రొఫెషనల్ షూటర్‌గా ఎలా మారింది? కోచ్‌గా వచ్చిన జగపతిబాబు వల్ల ఆమెకు అదృష్టం వరించిందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
ఇందులో కీర్తి సురేశ్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. నగేశ్ కుకునూర్ దర్శకుడు. దిల్‌రాజు సమర్పకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">