యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రభాస్.. రాముడి పాత్ర పోషించనున్నాడు. కాగా సీత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
'ఆదిపురుష్'లో సీత పాత్ర కోసం కీర్తి సురేశ్‌ను మాత్రమే ఎంపిక చేయాలని దర్శకుడు ఓం రౌత్ యోచిస్తునట్లు సమాచారం. ఈ చిత్రంలోని నటీనటులతో పాటు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు.