ETV Bharat / sitara

యూరప్​లో 'కార్తికేయ-2' .. 'ఆర్​' టైటిల్​తో గ్యాంగ్​స్టర్​గా ఉపేంద్ర - Disha Patani

Karthikeya 2 Shooting: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. యువ హీరో నిఖిల్ 'కార్తికేయ 2', రామ్​గోపాల్​ వర్మ- ఉపేంద్ర కాంబినేషన్​లో రానున్న 'ఆర్'​ సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

karthikeya 2 shooting
అనుపమ పరమేశ్వరన్‌
author img

By

Published : Mar 25, 2022, 7:04 AM IST

Updated : Mar 25, 2022, 10:34 AM IST

Karthikeya 2 Shooting: తెలుగులో ఫ్రాంఛైజీ సినిమాల జోరు కొనసాగుతోంది. అందులో భాగంగా రూపొందుతున్న మరో చిత్రం 'కార్తికేయ2'. 'కార్తికేయ'తో విజయాన్ని అందుకున్న నిఖిల్‌ - చందు మొండేటి కలయికలోనే రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం యూరప్‌ దేశాల్లో జరుగుతోంది. స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

karthikeya 2
అనుపమ

"ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసే మరో కొత్త రకమైన కథతో చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెర కెక్కించాం. ప్రస్తుతం యూరప్‌లో అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్‌ తొలి వారంలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తామ"ని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో అనుపమ ముగ్ధ అనే యువతిగా కనిపించనుంది.

'ఆర్‌'.. ఎవరికీ భయపడని గ్యాంగ్‌స్టర్‌: వైవిధ్యభరితమైన చిత్రాలతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ఉపేంద్ర. ఇప్పుడాయన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'ఆర్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు కొన్ని మోషన్‌ టీజర్లను ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారతదేశ చరిత్రలో ఓ నమ్మశక్యం కాని ప్రత్యేకమైన గ్యాంగ్‌స్టర్‌ కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలియజేశారు.

"బెంగళూరులో స్ట్రీట్‌ ఫైటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన 'ఆర్‌'.. ముంబయిలోని మాఫియానే కాకుండా దుబాయ్‌లో ఉన్న 'డీ' కంపెనీ అధినేత, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంనీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఇప్పుడా శక్తిమంతమైన 'ఆర్‌' పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. ప్రపంచంలో ఎవరికీ భయపడని డేర్‌డెవిల్‌ గ్యాంగ్‌స్టర్‌ 'ఆర్‌'" అని వర్మ తన వరుస పోస్ట్‌లలో రాసుకొచ్చారు.

ఆసక్తికర మిషన్‌: తాప్సీ ప్రధాన పాత్రలో ఆర్‌ఎస్‌జె స్వరూప్‌ తెరకెక్కించిన చిత్రం 'మిషన్‌ ఇంపాజిబుల్‌'. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్‌ కె.రాబిన్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇటీవలే ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ అందుకొంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.

taapsee pannu mission impossible
తాప్సీ

"నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా నటించింది. ముగ్గురు పిల్లల సహాయంతో ఆమె ఓ పెద్ద మిషన్‌ను ఎలా పూర్తి చేసింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథాంశం" అని చిత్ర వర్గాలు తెలిపాయి.

'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' చిత్రీకరణ పూర్తి: జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా నటిస్తున్న మల్టీస్టారర్‌ బాలీవుడ్‌ చిత్రం 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌'. 2014లో సిద్ధార్థ్‌ మల్హోత్రా, శ్రద్ధాకపూర్‌, రితేశ్ దేశ్‌ముఖ్‌లు నటించిన 'ఏక్‌ విలన్‌' చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది.

ek villain 2
దిశా పటానీ

ఈ సందర్భంగా బుధవారం రాత్రి ముంబయిలో ముగింపు ఉత్సవం నిర్వహించారు. ఇక్కడి ఫొటోలను దిశాపటానీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. "ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. 'ఏక్‌ విలన్‌'లాగే ఇది ప్రేక్షకుల మనసు తప్పక గెలుస్తుంది. మాకు మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది" అని దిశా రాసుకొచ్చింది. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది.

ek villain 2
తారా

ఇదీ చూడండి: RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?

Last Updated : Mar 25, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.