డ్రీమ్ వారియర్స్ పతాకంపై కార్తి కథానాయకుడిగా నటిస్తోన్న 'ఖైదీ' చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దర్శకుడు లోకేశ్. మొత్తం 62 రాత్రుల పాటు... చిత్రీకరణ జరగనున్నట్లు వెల్లడించారు.
కథ ప్రకారం హీరో ఓ ఖైదీ. రాత్రిపూట జైలు నుంచి తన బృందంతో బయట పడేందుకు ఓ పన్నాగం వేస్తాడు. మరి చివరికి పోలీసులు కళ్లుగప్పి తప్పించుకోగలిగాడా లేదా అనేది కథాంశం. సినిమాలో ఒక్కటి కూడా పగటి షాట్ కనిపించకుండా కేవలం 62 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు దర్శకుడు లోకేశ్ చెప్పారు.
ఇందులో కార్తికి తోటి ఖైదీలుగా వాసన్ కన్నా, రవి తదితరులు కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరూ ఉండరు. త్వరలోనే అధికారికంగా మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.