ETV Bharat / sitara

రూ.800 కోట్ల విలువైన సైఫ్-కరీనాల భవంతి చూశారా?

బాలీవుడ్ హీరో సైఫ్​ అలీఖాన్​కు వారసత్వంగా లభించిన ప్యాలెస్​కు ఓ సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ భవంతి విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. దానితో పాటు పలు విశేషాల సమాహారమే ఈ కథనం.

KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖాన్
author img

By

Published : Jun 12, 2020, 1:11 PM IST

చుట్టూ అందమైన ఉద్యానవనాలు. పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌. మధ్యలో అత్యంత ఖరీదైన భవంతి. చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్‌ ఖరీదు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. రాజరికపు కట్టడాలకు ఆనవాలుగా ఉన్న ఈ భవంతి మరెవరిదో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ది. 'పటౌడీ ప్యాలెస్‌'గా పేరు పొందిన ఈ భవంతి.. హరియాణాలోని పటౌడీ ప్రాంతంలో ఉంది. దీనినే 'ఇబ్రహీం కోఠి' అని కూడా పిలుస్తారు. పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు దీనిని నిర్మించి పరిపాలన సాగించారు.

KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖా

ఆ సంస్థానానికి చెందిన ఎనిమిదో నవాబు ఇఫ్తీఖర్ అలీఖాన్ పటౌడీ నుంచి ఆయన కుమారుడు మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీకి ఇది వారసత్వంగా వచ్చింది. మన్సూర్‌ అలీఖాన్‌ మరణం తర్వాత ఆయన కుమారుడైన సైఫ్‌ ఆధీనంలో ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ ఉంది.

KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖా

విందులు, వినోదాలు అక్కడే

సైఫ్‌ కుటుంబానికి చెందిన ఎన్నో శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలకు ఈ ప్యాలెస్‌ వేదికైంది. మొత్తం 150 గదులున్న ప్యాలెస్‌లో ఏడు డ్రెస్సింగ్‌ రూమ్స్‌, ఏడు పడక గదులు, డ్రాయింగ్‌ రూమ్స్‌, పెద్ద డైనింగ్‌ హాల్‌తోపాటు పలు సువిశాలమైన గదులున్నాయి. తన తండ్రి మరణాంతరం సైఫ్‌ అలీఖాన్‌ ఈ ప్యాలెస్‌కు కొంతమేర కొత్తరంగులద్దారు. సైఫ్‌ కుటుంబంలోని పలు ఫంక్షన్లలో ఈ ప్యాలెస్‌ మనకు దర్శనమిస్తుంది.

KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖా
KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖా
KAREENA SAIF PALACE
కరీనా కపూర్​- సైఫ్​ అలీఖా

ఇదీ చూడండి:సైఫ్​ ప్రేమను రెండుసార్లు తిరస్కరించిన కరీనా​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.